News August 29, 2024

USలో ఆకస్మిక మరణాలు.. ‘లిస్టెరియా’ అంటే ఏమిటి?

image

లిస్టెరియా అనేది బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్. కలుషిత ఆహారం తినడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఎక్కువగా గర్భిణులు, శిశువులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువున్న వారిపై దీని ప్రభావం ఉంటుంది. రిఫ్రిజిరేటర్లు, కటింగ్ బోర్డులను శుభ్రంగా ఉంచడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడంతో దీని బారి నుంచి తప్పించుకోవచ్చు. పెంపుడు జంతువులున్న వారూ జాగ్రత్తగా ఉండాలి. లిస్టెరియా వల్ల అమెరికాలో ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి.

Similar News

News September 14, 2024

ఒక్క బాల్ పడకుండా మ్యాచ్ రద్దు.. కేవలం 8 సార్లే

image

నోయిడా వేదికగా జరగాల్సిన కివీస్vsఅఫ్గాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే <<14089444>>రద్దయ్యింది<<>>. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలాంటి సందర్భాలు కేవలం ఎనిమిదిసార్లే నమోదయ్యాయి. 1890, 1938, 1970లో ఇంగ్లండ్vsఆస్ట్రేలియా మ్యాచ్‌లు, 1988లో కివీస్vsపాక్, 1989లో విండీస్vsఇంగ్లండ్, 1998లో పాక్vsజింబాబ్వే, 1998లో కివీస్vsఇండియా మ్యాచ్‌లు ఒక్క బాల్ పడకుండానే రద్దయ్యాయి.

News September 14, 2024

ఫలితాలు విడుదల

image

RRB ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను IBPS విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు <>ibpsonline.ibps.in<<>> వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇవి ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 3,4,10,17,18 తేదీల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఇందులో క్వాలిఫై అయినవారికి సెప్టెంబర్ 29న మెయిన్స్ నిర్వహిస్తారు.

News September 13, 2024

మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి.. 65మంది పిల్లలకు అస్వస్థత

image

ఝార్ఖండ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి కళేబరం రావడం కలకలం రేపింది. టోంగ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే ఆహారం తిన్న 65మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు వాంతులు చేసుకున్నారని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.