News November 23, 2024
ఆ వ్యాధితో సతమతమయ్యా: సింగర్ నేహా
తాను పీఎండీడీ వ్యాధితో బాధపడినట్లు ప్రముఖ సింగర్ నేహా బాసిన్ తెలిపారు. ఇప్పుడిప్పుడే దీని నుంచి కోలుకుంటున్నట్లు చెప్పారు. ‘నెలలో 15 రోజులు దీనితో బాధపడేదాన్ని. ఇలా ఏడాదిపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నా. అతిగా తినడం ప్రారంభించా. నాకు తెలియకుండానే 10 కిలోల బరువు పెరిగా. చివరకు యోగా, ఫిజియోథెరపీతో వ్యాధిని నయం చేసుకున్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. తెలుగులో ‘జైలవకుశ’ మూవీలోని స్వింగ్ జర సాంగ్ ఈమే పాడారు.
Similar News
News December 8, 2024
ఇది మూర్ఖపు చర్య: KCR
తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడాన్ని మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘ఇదొక మూర్ఖపు చర్య. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాల్లో మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని ప్రజలకు వివరించాలి’ అని BRS నేతలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు, MLCలకు ఆయన సూచించారు.
News December 8, 2024
సీఎంను కలిసిన స్టార్ బాయ్ సిద్ధు
TG: DJ టిల్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తండ్రి సాయికృష్ణతో కలిసి సీఎం రేవంత్‌కు రూ.15లక్షల చెక్కును అందించారు. తెలంగాణలో గతంలో సంభవించిన వరదలకు నష్టపోయిన ప్రాంతాలను ఆదుకునేందుకు CMRFకు విరాళంగా ఈ చెక్కును సిద్ధూ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో సిద్ధూను సీఎం అభినందించారు.
News December 8, 2024
యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: మంత్రి
TG: గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అర్హులైన పేదలకు వీటిని ఇస్తామని, సంక్రాంతిలోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. లబ్ధిదారులను యాప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.