News October 5, 2025

పెళ్లైన వారానికే సూసైడ్.. కారణమిదే!

image

TG: జగిత్యాల జిల్లా ఎర్దండిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న గంగోత్రి(22) వారానికే <<17908971>>సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. దసరా పండుగ రోజు భార్య గంగోత్రితో కలిసి భర్త సంతోష్ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మటన్‌ తింటూ కూరలో కారం లేదని గంగోత్రిని భర్త తిట్టాడు. ఆపై భోజనం చేయకుండా భార్యతో ఇంటికి వచ్చేశాడు. ఈ కారణంతోనే మనస్తాపం చెంది యువతి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 6, 2026

గిన్నిస్ రికార్డ్.. ఈయనకు 42 పళ్లు

image

సాధారణంగా మనిషికి 32 పళ్లు ఉంటాయని చదువుకున్నాం. కొందరికి 34 కూడా ఉండటం చూస్తుంటాం. కానీ మలేషియాకు చెందిన 33 ఏళ్ల ప్రతాప్ మునియాండికి ఏకంగా 42 పళ్లు ఉన్నాయి. ఈయనను అత్యధిక పళ్లున్న వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్వీట్ చేసింది. ఆయన ఫొటోను షేర్ చేయగా నోరంతా దంతాలే కనిపించాయి. 2021లో తన కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన ఆయన డెంటిస్టుల ద్వారా నిర్ధారించుకున్నారు.

News March 6, 2026

కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్

image

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై SM దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు SMపై నిషేధం ఉండగా ఫిన్‌ల్యాండ్, UK కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని KA ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.

News March 6, 2026

కేజీ వెండిపై రూ.5వేలు తగ్గుదల

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో <<19309772>>బంగారం<<>>తో పాటు ఇవాళ వెండి ధర తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,90,000 పలుకుతోంది. గత 6 రోజుల్లో కేజీ వెండిపై రూ.35వేలు తగ్గుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.