News December 27, 2024

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వర మీని వేల్పు మోహరమునదా
నెక్కినబారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుగదరా సుమతీ!
తాత్పర్యం: అవసరానికి పనికిరాని బంధువును, నమస్కరించి వేడుకున్నా కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధంలో ముందుకు పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టవలెను.

Similar News

News December 27, 2024

నా పిల్లలకు మన్మోహన్ స్కాలర్‌షిప్ ఇస్తానన్నారు: మలేషియా ప్రధాని

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం నెమరేసుకున్నారు. ‘గతంలో నేను జైలుకు వెళ్లినప్పుడు సింగ్ అండగా నిలిచారు. మలేషియా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా, నా పిల్లల చదువు కోసం స్కాలర్‌షిప్ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన ప్రతిపాదనను నేను సున్నితంగా తిరస్కరించా’ అంటూ సింగ్ మరణవార్త తెలిసి Xలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

News December 27, 2024

కాలువ‌లో ప‌డిన బ‌స్సు.. 8 మంది మృతి

image

పంజాబ్‌లోని బ‌ఠిండాలో ఓ బ‌స్సు కాలువ‌లోకి దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెందారు. స్థానిక MLA జ‌గ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివ‌రాల మేర‌కు వంతెన‌పై రెయిలింగ్‌ను ఢీకొన‌డంతో బ‌స్సు కాలువ‌లో పడిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డికక్క‌డే మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు ఆయ‌న తెలిపారు. 18 మంది ప్ర‌యాణికులు షాహిద్ భాయ్ మ‌ణిసింగ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

News December 27, 2024

All Time Low @ రూపాయి కన్నీళ్లు!

image

డాలర్‌తో పోలిస్తే రూపాయి సరికొత్త జీవితకాల కనిష్ఠానికి చేరుకుంది. చివరి రెండేళ్లలోనే ఒకరోజు అతిఘోర పతనం చవి చూసింది. వరుసగా ఏడో ఏడాదీ నష్టాలబాట పట్టింది. నేడు 85.31 వద్ద ఓపెనైన రూపాయి 85.82 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. ఆర్బీఐ జోక్యంతో కాస్త పుంజుకొని 85.52 వద్ద ముగిసింది. భారత ఎకానమీ గ్రోత్ తగ్గడం, ఇన్‌ఫ్లేషన్ పెరగడం, డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, FIIలు వెళ్లిపోవడమే పతనానికి కారణాలు.