News December 27, 2024
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వర మీని వేల్పు మోహరమునదా
నెక్కినబారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుగదరా సుమతీ!
తాత్పర్యం: అవసరానికి పనికిరాని బంధువును, నమస్కరించి వేడుకున్నా కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధంలో ముందుకు పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టవలెను.
Similar News
News January 25, 2025
నేడు షమీ ఆడతారా?
భారత స్టార్ బౌలర్ షమీ నేడు ఇంగ్లండ్‌తో జరిగే 2వ T20 ఆడటంపై సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న షమీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేశారు. అయితే మోకాలికి బ్యాండేజ్ వేసి ఉండటంతో మ్యాచ్ ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి T20 ఆడతారని భావించినా డగౌట్‌కే పరిమితమయ్యారు. అటు షమీ ఆరోగ్య పరిస్థితిపై BCCI ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం షమీ ఆడాలని కోరుకుంటున్నారు.
News January 25, 2025
వ్యాయామం చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి!
వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే అయినా జాగ్రత్తలు తీసుకోకుంటే గుండెపై భారం పడి కుప్పకూలిపోయే ప్రమాదముంది. శక్తికి మించి వ్యాయామం చేయకూడదు. ఒంట్లో నీటి % తగ్గకుండా చూసుకోవాలి. వ్యాయామాలు చేసేందుకు ఫిట్‌గా ఉన్నామా? లేదా? తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే చేయడం బెటర్. శరీరాకృతి కోసం స్టెరాయిడ్స్ వాడకూడదు. కడుపునిండా భోజనం చేసి ఎక్సర్‌సైజ్ చేయకూడదు.
News January 25, 2025
డాలర్‌తో రూపాయి క్షీణతపై మోదీకి కాంగ్రెస్ సెటైర్
డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని విమర్శించింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలం నుంచి ప్రస్తుత మోదీ పాలన వరకు రూపాయి క్షీణించడంలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందో తెలుపుతూ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. ఇందులో మోదీదే అత్యధిక వాటా అంటూ పేర్కొంది. పై ఫొటోలో దానికి సంబంధించిన వివరాలు చూడొచ్చు. రూపాయి విలువ భారీ పతనం మోదీ పాలనలో జరిగిందని అందులో కాంగ్రెస్ పేర్కొంది.