News December 22, 2024
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
కూరిమిగల దినములలో
నేరములెన్నడును గలుగనేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండ నిక్కము సుమతీ!
తాత్పర్యం: స్నేహం బాగా ఉన్న రోజులలో మిత్రులకు ఒకరు చేసిన పనులలో మరొకరికి తప్పులు కనిపించవు. అదే స్నేహితులకు విరోధం వచ్చినపుడు ఒకరి చేష్టలు మరొకరికి దోషములుగా కనిపిస్తాయి.
Similar News
News January 24, 2025
రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ కుటుంబాలు
AP: రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. 2016-17లో నాబార్డ్ రూరల్ ఫైనాన్షియల్ సర్వే ప్రకారం 34 శాతం వ్యవసాయ కుటుంబాలు ఉంటే, 2021-22లో ఆ సంఖ్య 53 శాతానికి చేరింది. దీంతో ఐదేళ్లలో రాష్ట్రంలో 19శాతం మేర వ్యవసాయ కుటుంబాలు పెరిగినట్లైంది. అటు దేశ సరాసరి కూడా 48% నుంచి 57%కు పెరిగింది. APతో పాటు దేశంలోని 20 రాష్ట్రాల్లో 50శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి.
News January 24, 2025
జేఈఈ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేశారా?
జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షల అడ్మిట్ కార్డులను NTA తాజాగా విడుదల చేసింది. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను గతంలోనే రిలీజ్ చేయగా, మిగతా రోజుల్లో జరిగే ఎగ్జామ్స్ కోసం తాజాగా ఆన్‌లైన్‌లో పెట్టింది. విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <
News January 24, 2025
నాన్‌స్టాప్ అడ్వెంచర్‌గా రాజమౌళి-మహేశ్ మూవీ!
మహేశ్‌తో రాజమౌళి చిత్రీకరిస్తున్న మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో నాన్‌స్టాప్ అడ్వెంచర్‌గా ఉంటుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే HYD అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. ఈ నెలాఖరులో మరో షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రా ఫైనల్ అయ్యారని, ఆమె బల్క్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.