News March 29, 2024
ఈ ఆదివారం వారికి సెలవు లేదు

ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఈ ఆదివారం బ్యాంకు ఉద్యోగులకు సెలవు లేదు. దీంతో మార్చి 31న దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయనున్నాయి. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్స్‌కు ఆటంకం లేకుండా ఆర్బీఐ ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్బీఐ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకైన డీబీఎస్ బ్యాంక్ ఇండియా కస్టమర్లకు సేవలు అందించనున్నాయి.
Similar News
News December 24, 2025
హెయిర్ స్టైలింగ్ చేస్తున్నారా?

హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఎక్కువగా వాడటం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతినడం, పొడిబారడం, తెగిపోవడం వంటివి జరుగుతాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఈ ప్యాక్స్ పాటించండి. * చల్లార్చిన టీ డికాషన్‌ను జుట్టుకు పట్టించి టవల్‌తో చుట్టేయాలి. పావుగంట కడిగేస్తే సరిపోతుంది. * తలస్నానం తర్వాత కండిషనర్, ఎప్సం సాల్ట్ కలిపి తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు మృదువుగా అవుతుంది.
News December 24, 2025
వేప చెట్లు ఎందుకు నిర్జీవంగా కనిపిస్తున్నాయి?

పంటలను చీడపీడల నుంచి కాపాడే వేప చెట్లే తెగుళ్ల బారినపడటం కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వేప చెట్ల కొమ్మలు, రెమ్మలు మాడి నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఫోమోప్సిస్ అజాడిరక్టే ఫంగస్ వల్లే ఇలా జరుగుతున్నట్లు వ్యవసాయ నిపుణులు తెలిపారు. ఇది ఒక చెట్టు నుంచి మరో చెట్టును ఆశిస్తోంది. అయితే ఇది ఏడాదిలో కొంతకాలం పాటే చెట్లకు సోకుతుందని, మళ్లీ ఈ చెట్లు కోలుకొని మళ్లీ పచ్చగా మారతాయని చెబుతున్నారు.
News December 24, 2025
మొదటి ప్లమ్ కేక్ స్టోరీ: మంబల్లి బాపు మ్యాజిక్!

మన దేశంలో మొదటి ప్లమ్ కేక్ 1883లో కేరళలోని తలస్సేరిలో తయారైంది. మంబల్లి బాపు అనే బేకరీ యజమాని దీన్ని తయారు చేశారు. అప్పటి బ్రిటిష్ ఆఫీసర్ ఇంగ్లండ్ నుంచి తెచ్చిన కేక్ తిని దాన్ని మన దేశీ స్టైల్లో రీక్రియేట్ చేశారు. విదేశీ బ్రాందీకి బదులు స్థానిక జీడిమామిడి పండ్ల సారా, అరటిపండ్లు వాడి అద్భుతమైన రుచిని తెచ్చారు. ఇప్పటికీ అదే పాత పద్ధతిలో కట్టెల పొయ్యి మీద ఈ కేకులను తయారు చేస్తున్నారు.


