News March 29, 2024

ఈ ఆదివారం వారికి సెలవు లేదు

image

ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఈ ఆదివారం బ్యాంకు ఉద్యోగులకు సెలవు లేదు. దీంతో మార్చి 31న దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయనున్నాయి. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్స్‌కు ఆటంకం లేకుండా ఆర్బీఐ ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్బీఐ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకైన డీబీఎస్ బ్యాంక్ ఇండియా కస్టమర్లకు సేవలు అందించనున్నాయి.

Similar News

News February 9, 2026

బలమైన బంధం కోసం రోజూ శృంగారం: సైంటిస్టులు

image

బలమైన సంబంధాల కోసం భార్యాభర్తలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. భాగస్వాములు సన్నిహితంగా ఉన్న రోజుల్లో వారిలో ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. కానీ ఇది 24 గంటల వరకేనని సూచిస్తున్నారు. అయితే రిలేషన్‌లో సమస్యలను తగ్గించుకునేందుకు జరిపే శృంగారం వల్ల తర్వాతి రోజు ఒత్తిడి పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. 319 జంటలపై చేసిన ఈ స్టడీ Archives of Sexual Behaviorలో ప్రచురితమైంది.

News February 9, 2026

గోత్రాలు ఎలా ఏర్పడతాయో తెలుసా?

image

గోత్రం అంటే మూల పురుషుడి నుంచి ఉద్భవించిన వంశం అని అర్థం. సంస్కృతంలో ‘గో’ అంటే వేదం, భూమి, ఆవు అనే అర్థాలున్నాయి. పూర్వం వశిష్ట, భరద్వాజ వంటి సప్తర్షుల పేర్ల మీద ఈ గోత్రాలు ఏర్పడ్డాయి. తమ వంశం ఏ గురువు లేదా మహర్షి ఆధ్యాత్మిక పరంపర నుంచి వచ్చిందో ఇది తెలియజేస్తుంది. కాలక్రమేణా ప్రముఖ వ్యక్తులు, పూర్వీకుల పేర్లతో కూడా గోత్రాలు వెలిశాయి. ఇది మన మూలాలను, వంశ గౌరవాన్ని గుర్తుచేసే ఓ పవిత్ర గుర్తింపు.

News February 9, 2026

వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వరి పొలంలో ఉన్న మురుగు నీటిని బయటకు పంపి మళ్లీ కొత్త నీటిని పెట్టాలి. అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులను ఇలాంటి పొలాల్లో వాడకూడదు. 10 కేజీల స్వర్ణపాల్ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 100 కేజీల వర్మికంపోస్ట్‌లో కలిపి ఎకరం పొలంలో చల్లుకోవాలి. లీటర్ నీటికి నీటిలో కరిగే స్థూల పోషకాలు (19.19.19) 10 గ్రాములను, 3 నుంచి 5 గ్రాముల సూక్ష్మపోషకాలను లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.