News September 20, 2024
రోదసిలో 59వ బర్త్‌డే చేసుకున్న సునీతా విలియమ్స్
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ISSలో తన 59వ పుట్టినరోజు జరుపుకున్నారు. రోదసిలో ఇది ఆమెకు రెండో బర్త్‌డే కావడం విశేషం. బోయింగ్ స్టార్‌లైనర్ లోపం కారణంగా ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సంగతి తెలిసిందే. 2006, 2012లో రోదసిలోకి వెళ్లిన ఆమెకు ఇది మూడో పర్యటన. సునీత క్షేమంగా భూమికి తిరిగిరావాలని ఆమె అభిమానులు నెట్టింట విష్ చేస్తున్నారు.
Similar News
News October 12, 2024
పండగకు ఊరెళ్తున్న సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేవంత్ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోనున్నారు.
News October 12, 2024
మ్యాచ్‌కు వర్షం ముప్పు?
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ జరిగే చివరిదైన 3వ T20 మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. శనివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉండదని భావిస్తున్నారు. నిన్న కూడా హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవడంతో ఇవాళ వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తాడేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అటు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే ఛాన్సుంది.
News October 12, 2024
జానీ మాస్టర్‌పై రేప్ కేసు పెట్టిన యువతిపై యువకుడి ఫిర్యాదు
జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్‌తో కలిసి HYD, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్‌నని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.