News December 6, 2024
రోదసిలో నడవనున్న సునీతా విలియమ్స్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది రోదసిలో నడవనున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లను ఆమె సిద్ధం చేసుకుంటున్నారు. సూట్స్‌లో డేటా రికార్డర్ బాక్స్, ఆక్సిజన్ పనితీరు వంటివాటిపై ఆమె పనిచేస్తున్నారని నాసా తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె భూమికి తిరిగిరానున్నారు. వారం రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక కారణాలతో 6 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే.
Similar News
News January 24, 2025
రాజ్యసభలో వైసీపీకి బిగ్ షాక్
AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీల సంఖ్య భారీగా తగ్గుతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది ఎగువసభ సభ్యులు ఉండేవారు. కొద్ది రోజుల క్రితం బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. రేపు రిజైన్ చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి సైతం రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.
News January 24, 2025
వైసీపీ చేసిన మంచిని ప్రజలకు బలంగా చెప్పాలి: సజ్జల
AP: వైసీపీ చేసిన మంచిని ప్రజలకు ఇంకా బలంగా చెప్పాలని ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నేతలతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. మీడియా అండతోనే అధికారంలోకి వస్తామనేది కేవలం అపోహ అని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మిసైల్స్‌లా దూసుకెళ్లాలన్నారు. టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పారు.
News January 24, 2025
Richest TV Star.. ఆస్తి రూ.5200 కోట్లు
ఆయన నటించరు. కనీసం పాడరు. డాన్సూ చేయరు. అయినా దశాబ్దకాలంగా హయ్యెస్ట్ పెయిడ్ టీవీ స్టార్‌గా గుర్తింపు పొందారు. ఏడాదికి రూ.650CR సంపాదిస్తారు. ఇప్పుడాయన నెట్‌వర్త్ ఏకంగా రూ.5200 కోట్లు. ఆయనే మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్, ప్రొడ్యూసర్, రియాల్టి షోస్ జడ్జి సైమన్ కోవెల్. The X Factor, Britain’s Got Talent, American Idol, America’s Got Talentకు జడ్జి. వీటితో పాటు Syco కంపెనీ ద్వారా ఆయనకు ఆదాయం వస్తుంది.