News November 7, 2024
క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం
నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమె బరువు తగ్గి చిక్కిపోయినట్లు ఉన్న ఓ ఫొటో వైరలవుతోంది. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత, విల్‌మోర్, సాంకేతిక లోపం కారణంగా తిరిగి రాలేకపోయారు. వచ్చే FEBలో భూమిపైకి తిరిగి వచ్చే అవకాశముంది.
Similar News
News November 7, 2024
ఓటమిని ఒప్పుకోవాల్సిందే.. సంతృప్తిగానే ఉన్నా: కమలా హారిస్
అమెరికా ఎన్నికల ఫలితాలను కచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని కమలా హారిస్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తాను ఇప్పటివరకు సాధించినదాని పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. ‘చాలా మంది దేశం చీకటిలోకి వెళ్తుందని భావిస్తున్నారు. కానీ అలా జరగదని నేను నమ్ముతున్నా. అమెరికా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ప్రజలందరికీ న్యాయం, గౌరవం, అవకాశాల కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.
News November 7, 2024
DSCలో ‘సమగ్ర శిక్ష’ సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్
AP: సమగ్రశిక్ష పథకం కింద పనిచేస్తున్న CRP, MIS కోఆర్డినేటర్లు, CRTలకు మెగా డీఎస్సీలో వెయిటేజీ మార్కులు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. వీరు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ పేర్కొంది. విధుల్లో బిజీగా ఉన్నందున మిగిలిన అభ్యర్థుల్లా వీరికి సన్నద్ధతకు అవకాశం ఉండదని తెలిపింది. 2019 డీఎస్సీలోనూ వెయిటేజ్ మార్కులు ఇచ్చారని గుర్తు చేసింది.
News November 7, 2024
పచ్చి పాలు తాగుతున్నారా?
పాలు తాగడం మంచి అలవాటే. కానీ, పచ్చి పాలను కాచకుండా తాగడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే శరీరానికి కలిగే దుష్ర్పభావాలు ఇవే. ఫుడ్ పాయిజనింగ్, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు సంభవించడం, యువకుల్లో ప్రాణాపాయం కలిగించే ఇన్ఫెక్షన్ రావడం, మహిళల్లో గర్భస్రావ పరిస్థితులు ఏర్పడటం వంటి ప్రమాదాలు జరగవచ్చు.