News November 7, 2024

క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం

image

నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమె బరువు తగ్గి చిక్కిపోయినట్లు ఉన్న ఓ ఫొటో వైరలవుతోంది. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత, విల్‌మోర్, సాంకేతిక లోపం కారణంగా తిరిగి రాలేకపోయారు. వచ్చే FEBలో భూమిపైకి తిరిగి వచ్చే అవకాశముంది.

Similar News

News December 2, 2024

TODAY HEADLINES

image

* రూ.2లక్షల లోపు రుణమాఫీ పూర్తి: CM రేవంత్
* AP: తుఫాన్ ఎఫెక్ట్.. చిత్తూరు, అన్నవరం జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటన
*TG: సంక్రాంతి తర్వాత రైతుభరోసా: CM రేవంత్
* AP: ప్రజల నుంచి నిరంతరం ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి: CM చంద్రబాబు
* TG: ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
* పెరిగిన కమర్షియల్ సిలిండర్, కోడిగుడ్ల ధరలు

News December 2, 2024

5వికెట్లు కోల్పోయినా 6 వికెట్ల తేడాతో భారత్ ఎలా గెలిచింది?

image

AUS PM XIతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయినా 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 5 వికెట్ల తేడా కదా? అనే సందేహం చాలామందికి వచ్చింది. అయితే 46ఓవర్ల మ్యాచ్‌లో మొదట PM XI 43.2 ఓవర్లలో 240/10 స్కోర్ చేసింది. భారత్ 42.5 ఓవర్లలోనే 4 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో గెలిచాక కూడా 46ఓవర్లు పూర్తిగా ఆడింది. లక్ష్యాన్ని ఛేదించాక మరో వికెట్ కోల్పోయింది.

News December 2, 2024

హెడ్‌పోన్స్ అతిగా వాడకండి!

image

కొందరు భారీ శబ్దంతో ఎక్కువ సేపు హెడ్‌ఫోన్స్ వాడుతుంటారు. ఇలానే చేసిన 38 ఏళ్ల లెక్చరర్ అవిక్ బెనర్జీ ఆస్పత్రి పాలయ్యారనే విషయం మీకు తెలుసా? 15 ఏళ్లుగా ఎక్కువ సౌండ్‌తో హెడ్‌సెట్ పెట్టుకొని గేమ్స్ ఆడుతుండగా ఒకరోజు చెవులు వినిపించలేదు. దీంతో ఆస్పత్రికి వెళ్లగా చికిత్స చేశారు. అందుకే తక్కువ శబ్దాన్ని వినాలని, మొబైల్ & స్క్రీన్ ఎక్కువ చూసేవారు 20-20-20 నియమాన్ని అనుసరించాలని వైద్యులు సూచిస్తున్నారు.