News February 22, 2025
దంచే ఎండలు.. తేలికపాటి జల్లులు

APలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు దంచేస్తుండగా మరోవైపు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అయితే వాతావరణం చల్లబడే పరిస్థితి లేదని పేర్కొంది. 3 రోజులపాటు కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5డిగ్రీలు, రాయలసీమలో 1-3డిగ్రీలు అధికంగా నమోదవుతాయంది.
Similar News
News March 18, 2025
OTTలోకి కొత్త సినిమాలు

తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా ఈనెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 20 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మూవీ తెలుగులో ఈనెల 14న థియేటర్లలో రిలీజైంది. వారం రోజుల్లోనే OTT బాట పట్టింది. ఈనెల 21 నుంచి ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.
News March 18, 2025
GREAT JOURNEY: బాల్ బాయ్ టు ఐపీఎల్ టీమ్ కెప్టెన్

స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జర్నీ స్ఫూర్తిదాయకం. 2008 IPL ప్రారంభ ఎడిషన్‌లో MIvsRCB మ్యాచ్‌కు బాల్ బాయ్‌గా ఉన్న అతను 2024లో KKRకు, ఇప్పుడు PBKSకు కెప్టెన్ అయ్యారు. తాజాగా ఆనాటి జ్ఞాపకాలను అయ్యర్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు రాస్ టేలర్, ఇర్ఫాన్ పఠాన్‌తో మాట్లాడినట్లు చెప్పారు. కాగా ఇప్పటివరకు ట్రోఫీ గెలవని పంజాబ్‌కు ఆ కోరిక తీరుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
News March 18, 2025
ఈడీకి చేరిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఈడీ ఫోకస్ చేసింది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపులపై, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ల సంపాదనపై ఆరా తీసింది. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్, హవాలా రూపంలో వారికి చెల్లింపులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే <<15801067>>11 మంది<<>> ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారణకు పిలిచారు.