News May 25, 2024
సన్రైజర్స్ బౌలింగూ బలంగానే ఉంది: గంభీర్

సన్రైజర్స్పై KKR మెంటార్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించారు. ఆ జట్టు సమతూకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘SRH బ్యాటర్లు ఈ సీజన్లో భారీ స్కోర్లు చేశారు. అలాగని వారికి బ్యాటింగ్ మాత్రమే ఉందనుకుంటే పొరపాటు. భువీ, నటరాజన్, కమిన్స్ వంటి అనుభవజ్ఞులైన పేస్ దళంతో బౌలింగ్ కూడా బాగుంది’ అని పేర్కొన్నారు. రేపు SRH, KKR జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 18, 2025
ఎనామలీ స్కాన్ ఎందుకంటే?

ప్రెగ్నెన్సీలో 20వారాల తర్వాత ఎనామలీ స్కాన్ చేయించాలని వైద్యులు సూచిస్తారు. మీ గర్భంలో పెరుగుతున్న బేబీ అవయవాల ఆకృతిని ఈ పరీక్ష విశ్లేషిస్తుంది. క్లెఫ్ట్ లిప్(పెదాల చీలిక), స్పైనా బైఫైడా (వెన్నుముక సరైన ఆకృతికి రాకపోవడం), ఎడ్వర్డ్ సిండ్రోమ్ (అదనపు క్రోమోజోమ్స్ ఉండడం), కంజెషనల్ హార్ట్ డిసీజ్(CHD) వంటివి ఇందులో తెలుస్తాయి. అంతర్గత అవయవాల ఎదుగుదలను కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఈ టెస్ట్ తప్పనిసరి.

గుండెలను పిండేసే ఘటన.. 3 తరాలు బూడిద

సౌదీ బస్సు ప్రమాదంలో HYDకు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలో <<18312045>>18<<>> మంది మరణించడంతో అతడి తల్లి రోషన్ గుండెలు బాదుకుంటున్నారు. చివరి చూపులకూ నోచుకోలేకపోతున్నామని, అల్లా ఎంత పని చేశాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ కుటుంబంలోని 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు మరణించారు. నసీర్ పెద్దకుమారుడు సిరాజుద్దీన్ USలో ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. ఆ కుటుంబంలో 3 తరాలు బూడిదైపోయాయి.