News May 25, 2024

సన్‌రైజర్స్ బౌలింగూ బలంగానే ఉంది: గంభీర్

image

సన్‌రైజర్స్‌పై KKR మెంటార్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించారు. ఆ జట్టు సమతూకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘SRH బ్యాటర్లు ఈ సీజన్‌లో భారీ స్కోర్లు చేశారు. అలాగని వారికి బ్యాటింగ్ మాత్రమే ఉందనుకుంటే పొరపాటు. భువీ, నటరాజన్, కమిన్స్ వంటి అనుభవజ్ఞులైన పేస్ దళంతో బౌలింగ్ కూడా బాగుంది’ అని పేర్కొన్నారు. రేపు SRH, KKR జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

Similar News

News February 13, 2025

చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు!

image

AP: తూర్పు గోదావరిలో మరో ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలోని చెరువుల్లో చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో చేపలు తినాలా? వద్దా? అని జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

News February 13, 2025

శ్రీలంక విద్యుత్ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్న అదానీ

image

శ్రీలంకలో తాము నిర్మించాల్సిన రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తప్పుకొంటున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. ఆ దేశంలో ఏర్పడిన కొత్త సర్కారు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని యోచిస్తోంది. అది తమకు అంతగా లాభించదన్న ఆలోచనతోనే అదానీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ బిలియన్ డాలర్ల వరకూ ఉండటం గమనార్హం.

News February 13, 2025

మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు: అచ్చెన్నాయుడు

image

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి విత్‌డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వల్లభనేని వంశీ బెదిరించడంతోనే ఇలా జరిగిందన్నారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. దాడికి ప్రతిదాడి చేయాలంటే 8 నెలల సమయం కావాలా? అని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

error: Content is protected !!