News February 5, 2025
వాట్సాప్‌లో సూపర్ ఫీచర్

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ChatGPT సేవల కోసం ఇప్పటికే 18002428478 నంబర్‌ను తీసుకురాగా ఇప్పుడు సేవల పరిధిని పెంచింది. ప్రస్తుతం టెక్ట్స్ మెసేజ్‌లకు మాత్రమే రిప్లైలు ఇస్తూ ఉండగా ఇకపై ఆడియో, ఫొటో ఇన్‌పుట్స్‌కూ సమాధానాలు ఇవ్వనుంది. ఆ ఫొటో/వాయిస్ నోట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ChatGPT స్పందిస్తుంది. ఆ నంబర్‌ను సేవ్ చేసుకుని మనకు కావాల్సిన ప్రశ్నలకు ఆన్సర్లు తెలుసుకోవచ్చు.
Similar News
News February 19, 2025
అదే మా పార్టీ ఆలోచన: KTR

తెలంగాణకు ఏనాటికైనా BRS పార్టీయే రక్షణ కవచం అని KTR అన్నారు. BRS విస్తృతస్థాయి సమావేశం అనంతరం మాట్లాడుతూ ‘KCR గారు ఒకటే మాట చెప్పారు. పార్టీలు ఓడిపోతుంటాయి. గెలుస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు, తెలంగాణ సమాజం గెలవాలి. అదే మా ఆలోచన’ అని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఫైరయ్యారు.
News February 19, 2025
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్

TG: 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు పోటీలు కొనసాగనున్నాయి. ఓపెనింగ్, క్లోజింగ్ సెర్మనీ, గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీల్లో 120 దేశాల యువతులు అలరించనున్నారు. ఇందులో పాల్గొనే వారి వయసు 17 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. ఏ దేశంలో పుడితే ఆ దేశం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. విజేతకు వజ్రాల కిరీటం అందిస్తారు.
News February 19, 2025
ఉద్యోగం వదిలేసి వ్యాపారం.. CM చంద్రబాబు ప్రశంసలు

ఇంజినీర్ ఉద్యోగం వదిలి మిల్లెట్ వ్యాపారం చేస్తున్న బొర్రా శ్రీనివాస రావును CM చంద్రబాబు ప్రశంసించారు. యువతకు స్ఫూర్తినిస్తున్న ఆయన్ను త్వరలో కలుస్తానన్నారు. ‘మన్యం గ్రెయిన్స్’ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీని ప్రారంభించి 400-500 మంది రైతులకు సాధికారత కల్పించారని పేర్కొన్నారు. వారి ఆదాయం 20-30% పెరిగేలా చేశారని తెలిపారు. 2018లో అనకాపల్లిలో నెలకొల్పిన ఈ సంస్థ ఆదాయం 2023-24లో ₹1cr+కి చేరింది.