News April 12, 2025
OTTలోకి సూపర్ హిట్ మూవీ

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సుజీత్-సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 31న విడుదలైంది. దాదాపు రూ.53 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమా ఇప్పటికే మరో ఓటీటీలోనూ రిలీజైన విషయం తెలిసిందే.
Similar News
News April 15, 2026
పెద్ది సినిమా రిలీజ్ మరోసారి వాయిదా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ పలు కారణాలతో జూన్ నెలకు పోస్ట్‌పోన్ అయింది.
News April 15, 2026
IPL చరిత్రలో అదిరిపోయే మ్యాచ్.. గుర్తుందా?

ఏడాది కిందట ఇదే రోజు IPLలో అరుదైన రికార్డ్ నమోదైంది. KKR, PBKS మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. తొలుత పంజాబ్ 111 పరుగులే చేసింది. దీంతో డికాక్, నరైన్, రింకూ, రస్సెల్ తదితరులతో స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న KKR ఈజీగా గెలుస్తుందని భావించారు. కానీ PBKS అద్భుతం చేసింది. చాహల్ 4, యాన్సెన్ 3 వికెట్లు తీయడంతో 95 రన్స్‌కే ఆలౌటైంది. IPL చరిత్రలో ఇదే లోయెస్ట్ స్కోర్ డిఫెండింగ్ మ్యాచ్ కావడం విశేషం.
News April 15, 2026
ముసలావిడే కానీ మహానుభావురాలు!

40ఏళ్లు దాటేసరికే జీవితం అయిపోయిందని చాలా మంది నిరుత్సాహపడుతున్న రోజులివి. కానీ కొత్త గమ్యాలకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు ప్రభావతి భగవతి అనే 98ఏళ్ల బామ్మ. 2017లో భర్త చనిపోవడం, పిల్లలు దూరంగా ఉండటంతో ఒంటరితనాన్ని జయించేందుకు ఇతరుల ప్రోత్సాహంతో 2018లో ‘నానీస్ నాశ్తా’ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 200కుపైగా కుటుంబాలకు గుజరాతీ, మహారాష్ట్ర వంటకాలను అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


