News August 4, 2024
పెన్షన్‌దారులకు సూపర్ న్యూస్

AP: పింఛన్ల బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన ఆప్షన్‌ను గ్రామ, వార్డు సచివాలయాలల్లో అందుబాటులో ఉంచింది. కొందరు ఉపాధి కోసం APలోని వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరు పింఛను కోసం ప్రతి నెలా సొంతూరు రావాల్సి వస్తోంది. ఇకపై ఇలాంటి వారు పెన్షన్ ట్రాన్స్‌ఫర్‌కు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. ఎక్కడికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతం, సచివాలయ వివరాలు అందించాల్సి ఉంటుంది.
Similar News
News December 13, 2025
₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్

దేశంలో రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2009-14 మధ్య 7,599 KM న్యూ ట్రాక్ వేస్తే, 2014-24 వరకు తాము 34,428 KM నిర్మించామని తెలిపారు. ₹6,74,920 కోట్లతో కొత్త రైల్వే లేన్లు, మల్టీ ట్రాకింగ్, గేజ్ కన్వర్షన్ చేపట్టామన్నారు. ఇప్పటికే 12,769 KMల నిర్మాణం పూర్తయిందన్నారు. పెరుగుతున్న సరకు రవాణా దృష్ట్యా నెట్వర్క్ కెపాసిటీ పెంచుతున్నామని చెప్పారు.
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
బిగ్‌బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్‌లో సంజన/భరణి/డెమోన్ పవన్‌లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.


