News March 16, 2024
RCBకి సూపర్ న్యూస్

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇటీవల కుమారుడు అకాయ్ జన్మించడంతో దాదాపు రెండు నెలలపాటు క్రికెట్కు దూరమైన అతడు రెండు మూడు రోజుల్లో ఆర్సీబీ జట్టులో చేరనున్నారు. ఈ నెల 22న CSKతో జరగనున్న మ్యాచ్కు ముందు బెంగళూరులో జరిగే RCB ప్రీ-టోర్నమెంట్ క్యాంప్లో కోహ్లీ పాల్గొంటారని Espncricinfo పేర్కొంది. త్వరలో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఐపీఎల్ అతడికి కీలకంగా మారనుంది.
Similar News
News December 6, 2025
ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

ఇండిగో ఫ్లైట్స్ రద్దు కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు అనుసంధానించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్లు పెంచారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్లు ఏర్పాటు చేశారు. అదనంగా 4 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


