News August 2, 2024

SCలను విడదీసే కుట్రలో సుప్రీం భాగస్వామ్యం: హర్షకుమార్

image

AP: ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు <<13751609>>గ్రీన్‌సిగ్నల్<<>> ఇవ్వడాన్ని మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యతిరేకించారు. ఐక్యమత్యంగా ఉన్న జాతిని విడదీయాలనే కుట్రలో అత్యున్నత న్యాయస్థానం భాగస్వామ్యమవడం విచారకరమన్నారు. రాజ్యాంగానికి లోబడకుండా తీర్పు ఇచ్చిందని విమర్శించారు. 11 రాష్ట్రాల అసెంబ్లీలు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్మానం పంపినా సుప్రీం పరిగణనలోకి తీసుకోలేదని దుయ్యబట్టారు.

Similar News

News November 18, 2025

X(ట్విటర్) డౌన్

image

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT

News November 18, 2025

చలికి చర్మం పగులుతుందా?

image

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.

News November 18, 2025

పాడి పశువులకు మేత, దాణా ఇలా అందిస్తే మంచిది(1/2)

image

పాడి పశువులకు వరిగడ్డి, చొప్పలాంటి ఎండు మేతతో పాటు తప్పనిసరిగా పచ్చిమేత ఉండాలి. పశువు శరీర బరువు, పాల మోతాదును అనుసరించి మేత అందిస్తే దాని పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాడి పశువు ప్రతి 45 కిలోల శరీర బరువుకు 1-1.5 కిలోల ఎండు మేత, 3-5 కిలోల పచ్చిమేత తింటుంది. నాలుగు లీటర్ల లోపు పాలిచ్చే పశువులకు సాధారణంగా 4-5 కిలోల ఎండుగడ్డి, 1-1.5 కిలోల దాణా మిశ్రమం సరిపోతుంది. ఎక్కువగా ఇచ్చి వృథా చేయకూడదు.