News August 2, 2024
SCలను విడదీసే కుట్రలో సుప్రీం భాగస్వామ్యం: హర్షకుమార్
AP: ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు <<13751609>>గ్రీన్‌సిగ్నల్<<>> ఇవ్వడాన్ని మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యతిరేకించారు. ఐక్యమత్యంగా ఉన్న జాతిని విడదీయాలనే కుట్రలో అత్యున్నత న్యాయస్థానం భాగస్వామ్యమవడం విచారకరమన్నారు. రాజ్యాంగానికి లోబడకుండా తీర్పు ఇచ్చిందని విమర్శించారు. 11 రాష్ట్రాల అసెంబ్లీలు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్మానం పంపినా సుప్రీం పరిగణనలోకి తీసుకోలేదని దుయ్యబట్టారు.
Similar News
News December 1, 2024
BREAKING: ఆగిన జియో నెట్‌వర్క్
దేశంలోని చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ స్తంభించిపోయింది. ఫోన్ కాల్స్ వెళ్లకపోవడం, స్లో ఇంటర్నెట్, కొన్ని వెబ్‌సైట్లు అసలే ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న యూజర్లు సోషల్ మీడియా వేదికగా టెలికం సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు తమకు 4గంటలుగా సర్వీస్ సరిగా లేదని వాపోతున్నారు. దీనిపై సంస్థ స్పందించాల్సి ఉంది. మీరూ జియో యూజరా? మీకు ఈ సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.
News December 1, 2024
రేపు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ
ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ కానుంది. ఏపీలోని మంగళగిరి APIIC కార్యాలయంలో జరిగే ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరగనుంది.
News December 1, 2024
SRH స్ఫూర్తి.. 20ఓవర్లలో 266 రన్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర బ్యాటింగ్‌లో ఊచకోత కోసింది. SRH క్రికెటర్ జయ్‌దేవ్ ఉనద్కత్ నేతృత్వంలోని సౌరాష్ట్ర 20 ఓవర్లలో 266 రన్స్ కొట్టింది. అందులో 21 సిక్సర్లు, 20 ఫోర్లుండటం గమనార్హం. ఛేదనలో బరోడా టీమ్ 20 ఓవర్లలో 188/8కి పరిమితం అయ్యింది. దీంతో 78 పరుగుల తేడాతో గెలిచింది. కాగా ఈ విషయాన్ని ఉనద్కత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘సన్ రైజర్స్ సౌరాష్ట్ర’ అంటూ రాసుకొచ్చారు.