News April 29, 2024
సీఏ పరీక్షల వాయిదాకు సుప్రీంకోర్టు నో
ఛార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం CA ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలు మే 8, 14న ఉండగా.. ఎన్నికలు మే 7, 13న ఉన్నాయని తెలిపింది. పోలింగ్ రోజుల్లో ఎలాంటి ఎగ్జామ్స్ లేవని పేర్కొంది. పరీక్షలు వాయిదా వేస్తే 4.36 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడతారని కోర్టు తెలిపింది. కోర్టు తీర్పుతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News November 12, 2024
మహిళలకు నెలకు రూ.1500.. బడ్జెట్‌లో నిధులు
AP: సూపర్‌సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 అందించే ఆడబిడ్డ నిధికి బడ్జెట్‌లో రూ.3341.82 కోట్లు కేటాయించింది. జెండర్ బడ్జెట్‌లో ఈ నిధుల్ని ప్రభుత్వం చూపించగా.. త్వరలోనే పథకం విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది.
News November 12, 2024
All in Red: అన్ని రంగాలు నష్టాల్లోనే
Niftyలోని అన్ని రంగాల షేర్లు మంగళవారం నష్టపోయాయి. ఆటో(1.94%), PSU Bank (1.92%), Financial Services సహా బ్యాంకు, FMCG, Metal, Pharma రంగ షేర్లు పతనమయ్యాయి. IT (0.05%), Realty (0.18%) స్వల్పంగా లాభపడ్డాయి. ఆగస్టు 5వ తేదీన 23,900 పరిధిలో Nifty సపోర్టు తీసుకుంది. ఇప్పుడు కూడా Day Chartలో అదే స్థాయిలో Red Candlestick ఫాం అవ్వడంతో తదుపరి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ఉత్కంఠ నెలకొంది.
News November 12, 2024
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును జడ్జి రిజర్వ్ చేశారు. <<14057734>>సింగిల్ బెంచ్ తీర్పును<<>> సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ సెక్రటరీ పిటిషన్ వేయగా, ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు జోక్యం చేసుకోవడం తగదంటూ అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్ చేశారు.