News August 9, 2024

NEET-PG వాయిదాకు సుప్రీంకోర్టు నో

image

ఈనెల 11న జరగనున్న NEET PG 2024 పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. పరీక్ష రాసే సిటీల పేర్లు జులై 31న, సెంటర్ల పేర్లు ఈనెల 8న ప్రకటించారని, ఇంత తక్కువ టైమ్‌లో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేమని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్ష వాయిదాకు కోర్టు నో చెప్పడంతో ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది.

Similar News

News October 31, 2025

ఘనంగా అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్

image

హీరో అల్లు శిరీష్-నయనిక ఎంగేజ్‌మెంట్ ఇవాళ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. పెళ్లి తేదీపై త్వరలో ప్రకటన రానుంది.

News October 31, 2025

ఆ హక్కు బీఆర్ఎస్‌కు లేదు: రేవంత్

image

TG: బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది బీఆర్ఎస్సే. గతంలో పీజేఆర్ చనిపోతే దుర్మార్గంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఇప్పుడు ఆ పార్టీకి సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మండిపడ్డారు. ఓట్లు అడిగేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తే వాతలు పెట్టాలని అన్నారు.

News October 31, 2025

బ్యాంకులకు కొత్త డొమైన్.. నేటితో ముగిసిన గడువు

image

సైబర్ నేరాలను తగ్గించడమే లక్ష్యంగా బ్యాంకులు తమ వెబ్‌సైట్లను .bank.in డొమైన్‌కు మార్చుతున్నాయి. ఇందుకు RBI విధించిన గడువు నేటితో ముగిసింది. ఇప్పటి వరకు SBI, PNB, CANARA వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు HDFC, ICICI, AXIS, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేటు బ్యాంకులూ కొత్త డొమైన్‌కు మారాయి. మరికొన్ని బ్యాంకులు .comతో కొనసాగుతూ ఏదైనా కేటగిరీ ఎంచుకున్నప్పుడు .bank.inకు రీడైరెక్ట్ చేస్తున్నాయి.