News August 9, 2024

NEET-PG వాయిదాకు సుప్రీంకోర్టు నో

image

ఈనెల 11న జరగనున్న NEET PG 2024 పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. పరీక్ష రాసే సిటీల పేర్లు జులై 31న, సెంటర్ల పేర్లు ఈనెల 8న ప్రకటించారని, ఇంత తక్కువ టైమ్‌లో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేమని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్ష వాయిదాకు కోర్టు నో చెప్పడంతో ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది.

Similar News

News September 9, 2024

జగన్ చేసిన అప్పు వల్ల ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్లు లేరు: సీఎం చంద్రబాబు

image

AP: విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలైన భవానీపురం, ఊర్మిలానగర్‌లో CM చంద్రబాబు మరోసారి పర్యటించారు. అక్కడ ప్రజలతో మాట్లాడారు. ‘ప్రభుత్వానికి కూడా ఇబ్బందులున్నాయి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్ రూ.10.50 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లారు. నేను ఇప్పుడు అప్పు అడిగినా ఇచ్చేవాళ్లు లేరు. వరద తీవ్రత వల్ల అందరికీ పూర్తిగా సాయం చేయలేకపోయాం. నష్టపోయిన అందరికీ న్యాయం చేస్తాం’ అని తెలిపారు.

News September 9, 2024

Stock Market: న‌ష్టాల నుంచి లాభాల్లోకి

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమ‌వారం ఆర‌ంభ న‌ష్టాల‌ను అధిగ‌మించి లాభాలు గ‌డించాయి. సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 81,559 వ‌ద్ద‌, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 24,936 వ‌ద్ద నిలిచాయి. ఉద‌యం నుంచి కూడా 24,950 వ‌ద్ద బ‌ల‌మైన రెసిస్టెన్స్ ఎదుర్కొన్న నిఫ్టీ సూచీ అక్క‌డ‌క్క‌డే క‌న్సాలిడేట్ అయ్యింది. ఆమెరికా జాబ్ డేటా భ‌య‌పెట్టినా కూడా ఇన్వెస్ట‌ర్లు కొనుగోళ్ల‌కు దిగడం గ‌మ‌నార్హం.

News September 9, 2024

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మాదే: హేజిల్‌వుడ్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంటామని ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తాజాగా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబరు నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు BGT కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 2014లో హేజిల్‌వుడ్ టెస్టుల్లో ఆరంగేట్రం చేసినప్పటి నుంచి నేటి వరకు భారత్‌తో ఆడిన ఒక్క టెస్టు సిరీస్ కూడా ఆస్ట్రేలియా గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలో గెలుపుకోసం తాము ఆకలిగా ఉన్నామని జోష్ పేర్కొన్నారు.