News March 23, 2025
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22లోగా సమాధానం ఇవ్వాలని తొలుత ఆయనకు ఆదేశాలు ఇవ్వగా స్పందించలేదు. దీంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను BRS కోరినా ఫలితం లేకపోవడంతో ఆ పార్టీ SCని ఆశ్రయించింది. ఈనెల 25న ఈ కేసును ధర్మాసనం విచారించనుంది.
Similar News
News April 22, 2025
16 బోగీలతో నమో ర్యాపిడ్ రైలు.. 24న ప్రారంభం

దేశంలోనే తొలిసారి 16 బోగీలతో నమో భారత్ ర్యాపిడ్ రైలు బిహార్‌లోని జయ్‌నగర్-పట్నా మధ్య సేవలందించనుంది. ఈ నెల 24న దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 2వేల మంది కూర్చునే వీలున్న ఈ రైలు గరిష్ఠంగా 110కి.మీ.ల వేగంతో దూసుకెళ్లనుంది. మరో వెయ్యి మంది నిలబడి ప్రయాణించవచ్చు. తొలి నమో భారత్ రైలు 12 కోచ్‌లతో గతేడాది సెప్టెంబర్‌లో అహ్మదాబాద్-భుజ్ మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే.
News April 22, 2025
ఏప్రిల్ 22: చరిత్రలో ఈరోజు

✒ 1870: రష్యా విప్లవకారుడు వ్లాదిమిర్ లెనిన్ జననం
✒ 1914: దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బీఆర్ చోప్రా జననం(ఫొటోలో)
✒ 1916: ప్రముఖ బెంగాళీ నటి కనన్ దేవి జననం
✒ 1939: చిత్రకారుడు, రచయిత శీలా వీర్రాజు జననం
✒ 1959: ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి జననం
✒ 1994: US మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం
✒ 2018: తొలితరం సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు మరణం
News April 22, 2025
ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ డేటా

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లోని నిరుద్యోగ గణాంకాలను 3 నెలలకోసారి రిలీజ్ చేస్తుండగా ఇకపై ప్రతినెలా ప్రకటించనుంది. మే15 నుంచి దీనికి శ్రీకారం చుట్టనుంది. అలాగే రూరల్ డేటాను 3 నెలలకోసారి(గతంలో ఏడాదికోసారి) వెలువరించనుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి నెలా నిరుద్యోగ డేటా వెలువడుతుంది. దీనివల్ల నిరుద్యోగితను తగ్గించేందుకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది.