News February 3, 2025
కుంభమేళాలో భక్తుల భద్రతపై నేడు సుప్రీంలో విచారణ

కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గైడ్లైన్స్ ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యర్థులుగా పిటిషనర్ పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

HYD నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్న్యూస్ తెలిపారు. డిసెంబర్ 2 నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ప్రతి మంగళవారం నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి భువనేశ్వర్(07165) ట్రైన్, అలాగే ప్రతి బుధవారం భువనేశ్వర్ నుంచి నాంపల్లి (07166) ట్రైన్ ప్రయాణికులకు సేవలందిస్తాయన్నారు. వచ్చేనెల 23 వరకు ఈ ప్రత్యేక రైలు ఉంటుందన్నారు.
News November 21, 2025
సెయిల్లో 124 పోస్టులు.. అప్లై చేశారా?

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)లో 124 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.sail.co.in
News November 21, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 11

62. డంభం అంటే ఏమిటి? (జ.తన గొప్ప తానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (జ.తన భార్యలో, తన భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (జ.ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (జ.ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (జ.మైత్రి)
<<-se>>#YakshaPrashnalu<<>>


