News February 3, 2025
కుంభమేళాలో భక్తుల భద్రతపై నేడు సుప్రీంలో విచారణ

కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గైడ్‌లైన్స్ ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యర్థులుగా పిటిషనర్ పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
NGKL జిల్లాలో 1,403 టన్నుల యూరియా నిల్వలు

NGKL జిల్లాలో 1,403 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెలలో మరో 4,349 టన్నుల యూరియా జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. ఈ యాసంగిలో రైతులకు ఇప్పటివరకు 1.44 లక్షల బస్తాల యూరియా అధికంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. మొక్కజొన్న పంట సాగుచేసిన రైతులందరికీ దాదాపు యూరియా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
News January 18, 2026
ప్చ్.. రో‘హిట్’ అవ్వలేదు

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చారు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి ఫౌల్క్స్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. సిరీస్ మొత్తంగా 61 పరుగులే చేశారు. మరో ఆరు నెలల వరకు వన్డే మ్యాచ్‌లు లేవు. హిట్ మ్యాన్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. మళ్లీ IPL-2026లోనే రోహిత్ ఆటను చూడవచ్చు. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు.
News January 18, 2026
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.


