News September 9, 2024
కోల్కతా వైద్యులకు సుప్రీం కోర్టు అల్టిమేటం

కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచారంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న డాక్టర్లకు సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. రేపు సాయంత్రం ఐదింటికల్లా వారంతా తమ విధులకు హాజరుకావాలని తేల్చిచెప్పింది. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలపై భారత వైద్య సంఘం(IMA) బెంగాల్ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైద్యులకు అండగా నిలుస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
Similar News
News November 24, 2025
పార్వతీపురం: ‘నలుగురు కార్యదర్శులు సస్పెండ్’

కొమరాడలో సచివాలయంలో విధులు నిర్వహించిన నలుగురు కార్యదర్శులపై సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు ఎంపీడీవో రమేశ్ తెలిపారు. గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగాయి అన్న అభియోగంపై గతంలో పనిచేసిన కార్యదర్శులు శ్రీనివాసరావు, వైకుంఠరావు, గణపతితోపాటు ప్రస్తుత కార్యదర్శి నాగరాజును కూడా సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 24, 2025
ఎయిమ్స్ కల్యాణి 172 పోస్టులకు నోటిఫికేషన్

పశ్చిమ బెంగాల్లోని <
News November 24, 2025
తాంబూలం ఇలా ఇస్తేనే ఎక్కువ ఫలితం

☞ తమలపాకు చివర్లు, అరటి పండ్లు చివర్లు ఇచ్చేవారి వైపు ఉండకూడదు. లేకపోతే తాంబూలం ఇచ్చిన ఫలితం దక్కదని పండితులు చెబుతారు. ☞ తాంబూలంలో తమలపాకులు బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. 3, 5 ఆకులు ఇవ్వడం ఉత్తమం. ☞ తాంబూలంలో ఒకటి కన్నా ఎక్కువ పండ్లు పెట్టాలి. ☞ ఒకే రకానికి చెందిన ఒక్క పండు ఎప్పటికీ తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదు. ☞ తాంబూలంలో దక్షిణ కూడా కచ్చితంగా ఉండాలి. అందుకే రూపాయి, 2 రూపాయల నాణేలు ఉంచాలి.


