News September 9, 2024

కోల్‌కతా వైద్యులకు సుప్రీం కోర్టు అల్టిమేటం

image

కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచారంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న డాక్టర్లకు సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. రేపు సాయంత్రం ఐదింటికల్లా వారంతా తమ విధులకు హాజరుకావాలని తేల్చిచెప్పింది. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలపై భారత వైద్య సంఘం(IMA) బెంగాల్ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వైద్యులకు అండగా నిలుస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

Similar News

News October 4, 2024

మ‌హిళ‌ల‌పై నేరాలు చూడ‌లేక క‌ళ్లు మూసుకున్న దుర్గామాత‌ విగ్ర‌హం వైర‌ల్‌

image

ట్రైనీ డాక్ట‌ర్‌ హ‌త్యాచార ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ కోల్‌కతాలో ద‌స‌రా ఉత్సవాల నిర్వాహకులు ఓ మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం ఆలోచింపజేస్తోంది. జీవ‌చ్ఛవంలా పడి ఉన్న బాధితురాలిని చూడలేక దుర్గామాత కళ్లు మూసుకున్నట్టు, సింహం సిగ్గుతో తలదించుకున్నట్టు విగ్రహాల్ని ఏర్పాటు చేశారు. మహిళలపై నేరాలకు నిరసనగా ఏర్పాటు చేసిన ఈ మండపం ‘లజ్జా’ (అవమానం) ఇతివృత్తంతో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

News October 4, 2024

అందుకే పాక్ కంటే ఇంగ్లండ్ బెటర్: పాక్ క్రికెటర్

image

ఇంగ్లండ్ ప్రొఫెషనల్ క్రికెట్ అద్భుతంగా ఉంటుందని పాక్ క్రికెటర్ మొహమ్మద్ అబ్బాస్ తెలిపారు. జీతాలు, బట్టలు, ఆహారం అన్నీ పాకిస్థాన్ కంటే బెటర్‌గా అందిస్తుందని చెప్పారు. ‘క్వీన్ ఎలిజబెత్ చనిపోయినా ఇంగ్లండ్ క్రికెట్ షెడ్యూల్ మార్చలేదు. ఆటగాళ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. కానీ పాక్‌లో ఇలాంటి పరిస్థితులు లేవు. పీసీబీ చెప్పినట్లే నడుచుకోవాలి. అందుకే కౌంటీల్లో ఆడేందుకే నా ప్రాధాన్యం’ అని ఆయన చెప్పుకొచ్చారు.

News October 4, 2024

దసరాకు ప్రత్యేక రైళ్లు

image

దసరా సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.