News May 17, 2024
వివేకా హత్యపై మాట్లాడొద్దన్న ఆదేశాలపై సుప్రీం స్టే
AP: వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయన్న ధర్మాసనం.. YS షర్మిల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఏప్రిల్ 16న వివేకా హత్యపై మాట్లాడొద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ వైఎస్ షర్మిల హైకోర్టుకెళ్లారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Similar News
News January 9, 2025
సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
TG: ఈ నెల 13 నుంచి 24 వరకు బ్రిస్బేన్, దావోస్‌లలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ బెయిల్ కోసం అప్పట్లో పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించారు. త్వరలో పలు దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని, 6 నెలలు పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. జులై 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.
News January 9, 2025
BGT ఓటమికి కారణాలేంటి?.. త్వరలో బీసీసీఐ రివ్యూ మీటింగ్
BGT సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్‌తో త్వరలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, BCCI అధికారులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గంభీర్, స్టాఫ్ తీరుపై పలువురు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ద్రవిడ్ టైమ్‌తో పోలిస్తే కమ్యూనికేషన్ సరిగా లేదని వస్తున్న ఆరోపణలపై దృష్టిసారిస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
News January 9, 2025
Results Season: నష్టాలు తెచ్చాయి..!
స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. కార్పొరేట్ సంస్థలు Q3 ఫలితాలు ప్రకటించే సీజన్ ప్రారంభంకావడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నట్టు కనిపిస్తోంది. సెన్సెక్స్ 442 పాయింట్లు నష్టపోయి 77,681 వద్ద, నిఫ్టీ 162 పాయింట్లు కోల్పోయి 23,526 వద్ద స్థిరపడ్డాయి. India Vix 14.69గా ఉంది. రియల్టీ, IT, మెటల్, PSU బ్యాంక్స్, ఫైనాన్స్ రంగాలు నష్టపోయాయి. BAJAJ Auto టాప్ గెయినర్.