News September 23, 2024

ఛైల్డ్ పోర్నోగ్రఫీ‌పై సుప్రీం కీలక తీర్పు

image

ఛైల్డ్ పోర్నోగ్రఫీపై ఇటీవల మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, డౌన్‌లోడ్ చేయడం పోక్సో ప్రకారం నేరమేనని స్పష్టం చేసింది. కాగా ఛైల్డ్ పోర్నోగ్రఫీ షేర్ చేయకుండా డౌన్‌లోడ్ చేయడం, వీక్షించడం నేరం కాదన్న మద్రాస్ HC తీర్పును ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఛైల్డ్ పోర్నోగ్రఫీ పదంపై చట్టసవరణ చేయాలని సూచించింది.

Similar News

News October 15, 2024

మద్యం దుకాణాల్లో SPY రెడ్డి కుమార్తె హవా

image

AP: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సన్నపురెడ్డి సుజల 10కిపైగా మద్యం దుకాణాలను లాటరీలో దక్కించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 6, అనంతపురంలో 4, కర్నూలులో 1, పీలేరు నియోజకవర్గంలో కూడా ఆమె పలు షాపులు కైవసం చేసుకున్నారు. కాగా కర్నూలు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి అనుచరులు సిండికేట్‌గా ఏర్పడి 246 దరఖాస్తులు వేయగా ఒక్కటంటే ఒక్క దుకాణం కూడా దక్కలేదు. దీంతో వారు లబోదిబోమంటున్నారు.

News October 15, 2024

నేటి నుంచి డిగ్రీ కళాశాలలు బంద్

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలనే డిమాండ్‌తో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నేటి నుంచి బంద్ పాటిస్తున్నాయి. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలు నడపలేకపోతున్నామని డిగ్రీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ తెలిపింది. ఉద్యోగుల జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నట్లు పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది.

News October 15, 2024

‘i-Pill అంటోంది I miss you’.. వివాదం రేపిన జెప్టో నోటిఫికేషన్

image

డిజిటల్ మార్కెటింగ్‌లో క్యాచీ హెడ్‌లైన్స్, ట్యాగ్స్ భలే అనిపిస్తాయి. పదాల అర్థం, పద్ధతులపై అవగాహన లేకుంటే మిస్‌ఫైర్ అవుతాయి. వర్క్ ప్లేస్‌లో సెక్సువల్ హరాస్‌మెంట్‌పై పోరాడే బెంగళూరు లాయర్‌కు ‘ఐ పిల్ గర్భనిరోధక మాత్ర అంటోంది, ఐ మిస్ యూ పల్లవి’ అంటూ జెప్టో పంపిన మెసేజ్ పెద్ద వివాదానికే దారితీసింది. అంటే నన్నిప్పుడు దీన్ని తీసుకోమంటారా అని LinkedInలో ఆమె లాంగ్ పోస్ట్ పెట్టడంతో జెప్టో సారీ చెప్పింది.