News February 20, 2025

ఆయుధాలు సరెండర్ చేయండి: మణిపుర్ గవర్నర్ వార్నింగ్

image

జాతుల వైరంతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో మళ్లీ శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చోరీ చేసిన, అక్రమ ఆయుధాలను వెంటనే సరెండర్ చేయాలని గవర్నర్ అజయ్ భల్లా ఆదేశించారు. ఇందుకు 7 రోజుల సమయం ఇచ్చారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రపతి పాలన విధించిన వారంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే అక్కడ కేంద్ర బలగాలు తమ కవాతుతో సైకలాజికల్ ఆపరేషన్స్ ఆరంభించాయి.

Similar News

News November 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. కారు యజమాని ఎవరంటే?

image

ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు i20 <<18253113>>కారు<<>>లో జరిగిందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కారు రిజిస్ట్రేషన్ నం. HR26 CE7674 కాగా హరియాణాలోని గురుగ్రామ్‌లో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. యజమాని మహ్మద్ సల్మాన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. పుల్వామాకు చెందిన తారిక్ అనే వ్యక్తికి ఈ కారును అమ్మానని సల్మాన్ పోలీసులకు చెప్పాడని NDTV తెలిపింది. అయితే తారిక్ మరో వ్యక్తికి కారును అమ్మారా అనే విషయం తెలియాలి.

News November 11, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 11, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.