News August 27, 2024
రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సర్వే: రామ్మోహన్
AP: రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సర్వే ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలో విమానాశ్రయాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 18, 2024
శ్రీలంక క్రికెటర్ అరుదైన ఘనత
టెస్టుల్లో శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో 80.90 యావరేజ్ కలిగిన రెండో బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. అగ్ర స్థానంలో బ్రాడ్‌మన్ (99.94) ఉన్నారు. మూడో స్థానంలో జైస్వాల్ (68.53) కొనసాగుతున్నారు. మెండిస్ తానాడిన తొలి 7 టెస్టుల్లోనే 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో 809 రన్స్ సాధించారు. కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన వారిలో అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్‌గానూ నిలిచారు.
News September 18, 2024
ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అటు తెలంగాణలో ఈ నెల 21 నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News September 18, 2024
చెలరేగిన అఫ్గాన్.. 106కే సఫారీలు ఆలౌట్
షార్జాలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ బౌలర్లు చెలరేగిపోయారు. వారి ధాటికి సఫారీలు 106 పరుగులకే చాప చుట్టేశారు. వియాన్ ముల్డర్ 52 పరుగులతో రాణించడంతో ప్రోటీస్ జట్టు ఆమాత్రం స్కోరైనా చేసింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరూకీ 4, ఘజన్‌ఫర్ 3, రషీద్ 2 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. అఫ్గాన్ బ్యాటర్లు ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది.