News February 15, 2025

సర్వే: ‘ఇండియా’ కూటమి ఉండాల్సిందే..

image

దేశంలో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి కొనసాగాల్సిందేనని ఇండియా టుడే-సీ ఓవర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యధిక మంది కోరుకున్నారు. 65% మంది ఈమేరకు అభిప్రాయపడగా 26% మంది అవసరంలేదని తేల్చి చెప్పారు. ఇక కూటమికి నాయకుడిగా రాహుల్ గాంధీకి అత్యధికంగా 24శాతం ఓట్లు రాగా 14శాతం ఓట్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కేజ్రీవాల్, అఖిలేశ్ నిలిచారు.

Similar News

News January 1, 2026

ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఉద్యోగాలు

image

<>ఇన్‌కమ్<<>> ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ 3 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB/LLM, CA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.60వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://incometaxkarnatakagoa.gov.in

News January 1, 2026

భారత్ అందరిదీ.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

image

డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థిపై జరిగిన జాతివివక్ష దాడి నేపథ్యంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం అందరిది. కులమతాలు, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేయొద్దు’ అని ఆయన పిలుపునిచ్చారు. విభజన భావాలను వీడి సమానత్వంతో మెలగాలని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన సభలో సూచించారు. దాడిలో చనిపోయిన విద్యార్థి ఏంజల్ చక్మా మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక సామరస్యం అవసరమని గుర్తుచేశారు.

News January 1, 2026

అనుకున్న సమయానికి అమరావతి పూర్తి చేస్తాం: నారాయణ

image

AP: అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికే రాజధానిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. మూడేళ్లలో పూర్తిస్థాయిలో అమరావతి రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే CM చంద్రబాబు అనేక పెట్టుబడులను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.