News April 25, 2024

చాహల్‌ను బతిమాలుకోండి: RCBకి ఊతప్ప సూచన

image

తిరిగి జట్టులోకి రావాలని స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను బతిమాలుకోవాలని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప RCBకి సూచించారు. ‘చాహల్‌తోపాటు హర్షల్ పటేల్‌ను కూడా వెనక్కిరావాలని కోరండి. శివమ్ దూబే, పడిక్కల్, మయాంక్ అగర్వాల్ లాంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోండి. జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్నా వరుస ఓటములు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 25 మంది ఆటగాళ్లను ఆడించినా.. ఫలితం లేదు’ అని ఆయన అన్నారు.

Similar News

News December 10, 2025

టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాలి.. TSUTF డిమాండ్

image

TG: నిన్న విద్యాశాఖ ప్రకటించిన పదో తరగతి ఎగ్జామ్స్ <<18515127>>షెడ్యూల్‌పై<<>> తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(TSUTF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 7 పేపర్లను 35 రోజుల పాటు నిర్వహించడం సరికాదంది. అశాస్త్రీయంగా రూపొందించిన SSC టైమ్ టేబుల్‌ను వెంటనే మార్చాలని డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

News December 10, 2025

ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న ‘స్ట్రోక్’ కేసులు.. ఎందుకంటే?

image

కొన్నేళ్లుగా 20-40 ఏళ్ల యువకుల్లో స్ట్రోక్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమని వైద్యులు పేర్కొన్నారు. ఐటీ నిపుణులు ఉన్నట్టుండి నాడీ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ‘అదుపు లేని రక్తపోటు, నిద్రలేమి, అధిక ఒత్తిడి, ధూమపానం, నిశ్చల జీవనశైలితో పాటు షుగర్ వంటివి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు. యువతలో స్ట్రోక్ ఆరోగ్యాన్నే కాకుండా వారి కెరీర్, కుటుంబ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News December 10, 2025

MLAల జీతాలు భారీగా పెంచిన ఒడిశా

image

ఒడిశాలో MLAల జీతాలు భారీగా పెరిగాయి. తమ జీతాన్ని దాదాపు మూడు రెట్లు పెంచే బిల్లుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. జీతం, అలవెన్సులతో కలిపి గతంలో నెలకు రూ.1.11లక్షలు ఉండగా ఇప్పుడు ఇది ఏకంగా రూ.3.45 లక్షలకు చేరింది. దీంతో దేశంలో MLA జీతం అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఇప్పటివరకూ ఈ స్థానంలో తెలంగాణ ఉండేది. ఇక్కడి శాసనసభ్యుల జీతం రూ.2.5లక్షలుగా ఉంది. MLA జీతం పెంపుపై మీ కామెంట్?