News April 25, 2024

చాహల్‌ను బతిమాలుకోండి: RCBకి ఊతప్ప సూచన

image

తిరిగి జట్టులోకి రావాలని స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను బతిమాలుకోవాలని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప RCBకి సూచించారు. ‘చాహల్‌తోపాటు హర్షల్ పటేల్‌ను కూడా వెనక్కిరావాలని కోరండి. శివమ్ దూబే, పడిక్కల్, మయాంక్ అగర్వాల్ లాంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోండి. జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్నా వరుస ఓటములు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 25 మంది ఆటగాళ్లను ఆడించినా.. ఫలితం లేదు’ అని ఆయన అన్నారు.

Similar News

News December 9, 2025

టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

image

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్‌ను పైన ఫొటోలో చూడవచ్చు. అనుకున్నట్టే CBSE పరీక్షల తరహాలో ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఇచ్చారు. ఒక్కో పరీక్షకు మధ్య 4-5 రోజుల సమయం ఉంది. విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఇది ఉపయోగపడనుంది.

News December 9, 2025

అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందే: సుప్రీంకోర్టు

image

పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) <<18513734>>వ్యవహారంపై<<>> సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. SIR కొనసాగుతుందని స్పష్టం చేసింది. BLOలపై బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం, బెదిరింపులను తమ దృష్టికి తేవాలని ECని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పింది.

News December 9, 2025

ఈ టైమ్‌లో రీల్స్ చూస్తున్నారా? వైద్యుల సలహా ఇదే!

image

ఈమధ్య చాలామంది రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసర రీల్స్ చూసే సమయాన్ని వ్యాయామానికి, నిద్ర కోసం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఫోన్‌లో రీల్ స్క్రోల్ చేయకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలిపారు. రాత్రుళ్లు మొబైల్ నుంచి వచ్చే బ్లూలైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్‌ను అణచివేసి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని వారు హెచ్చరించారు. share it