News March 16, 2024
సూర్యాపేట: కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో గరిడేపల్లి మండలం మర్రికుంట దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో మట్టంపల్లి మండలం బిల్లా నాయక్ తండాకు చెందిన నవీన్ మృతి చెందాడు. గరిడేపల్లి నుండి సూర్యాపేట వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 17, 2026
నల్గొండ: పారదర్శకంగా మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు: కలెక్టర్ చంద్రశేఖర్

జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పారదర్శకగా ఈ కేటాయింపులు చేపట్టారు. 2011 జనాభా లెక్కలు, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ ప్రక్రియ నిర్వహించామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
News January 17, 2026
నల్గొండ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

నల్గొండ మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పాత మున్సిపల్ భవనంలోనే కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేషన్గా మారడంతో నగర అభివృద్ధికి మరిన్ని నిధులు, వసతులు సమకూరుతాయని తెలిపారు.
News January 17, 2026
NLG: మేయర్ పీఠం సహా 9 పురపాలికలు మహిళలకే

ఉమ్మడి జిల్లాలో మేయర్ పీఠంతో పాటు 9 పురపాలికల ఛైర్పర్సన్ స్థానాలు మహిళలకే దక్కాయి. ఎస్సీలకు రెండు, బీసీలకు 3, జనరల్ 7, జనరల్ మహిళలకు 7 స్థానాలకు రిజర్వు చేశారు. బీసీలకు రిజర్వు చేసిన మూడింటిలో ఒక్కటి మాత్రమే జనరల్ కాగా రెండు మున్సిపాలిటీలు మహిళలకే రిజర్వు చేయడం విశేషం.


