News December 3, 2024

ఉత్కంఠ: శిండేతో ఫడణవీస్ భేటీ

image

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండేను బీజేపీ ముఖ్యనేత దేవేంద్ర ఫడణవీస్ కలిశారు. సీఎం అధికార నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. మరోవైపు సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభాపక్షనేతను ఎన్నుకోనున్నారు.

Similar News

News January 20, 2026

లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి? సింపుల్ ఫార్ములా..

image

‘10 టైమ్స్ యాన్యువల్ ఇన్‌కమ్’ అనేది ఒక వ్యక్తికి ఎంత మొత్తంలో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలో లెక్కించే సులభమైన పద్ధతి. దీని ప్రకారం ఏడాది ఆదాయానికి కనీసం 10 రెట్ల లైఫ్ కవర్ ఉండాలి. Ex వార్షిక ఆదాయం ₹15 లక్షలు అయితే ₹1.5 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మరణం తర్వాత కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అప్పులు లేదా అదనపు బాధ్యతలు ఉంటే మాత్రం ఇది సరిపోదు.

News January 20, 2026

మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్

image

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య, నటి ప్రియా మోహన్ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘మళ్లీ గర్భవతి అయ్యాను. మా ఇల్లు మరింత హాయిగా, సందడిగా మారబోతోంది. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని ప్రియా మోహన్ సైతం బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో అట్లీ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

News January 20, 2026

వివేకా హత్య కేసును లాజికల్ ఎండ్‌కు తీసుకెళ్లాలి: SC

image

వివేకానందరెడ్డి హత్యపై మళ్లీ మినీ ట్రయల్ కొనసాగిస్తే కేసు తేలడానికి మరో పదేళ్లు పడుతుందని SC వ్యాఖ్యానించింది. సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. కేసును లాజికల్ ఎండ్‌కు తీసుకెళ్లాల్సిన అవసరముందని పేర్కొంది. పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దాని వైఖరిని అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. కేసును ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.