News December 3, 2024

ఉత్కంఠ: శిండేతో ఫడణవీస్ భేటీ

image

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండేను బీజేపీ ముఖ్యనేత దేవేంద్ర ఫడణవీస్ కలిశారు. సీఎం అధికార నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. మరోవైపు సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభాపక్షనేతను ఎన్నుకోనున్నారు.

Similar News

News February 14, 2026

ఫొటో తీయండి.. ₹1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ కొట్టేయండి!

image

నేషనల్ హైవేలపై టాయిలెట్ల పరిశుభ్రతను పెంచేందుకు NHAI తెచ్చిన ‘Clean Toilet Picture Challenge’ గడువును 2026 జూన్ 30 వరకు పొడిగించారు. హైవేపై వెళ్లేటప్పుడు ఎక్కడైనా టాయిలెట్లు డర్టీగా ఉంటే ఆ ఫొటోను Rajmargyatra యాప్‌లో లొకేషన్ వివరాలతో అప్‌లోడ్ చేయాలి. కంప్లైంట్ నిజమని తేలితే 5రోజుల్లో మీ ఫాస్టాగ్ అకౌంట్‌కు ₹1,000 క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్ కేవలం NHAI పరిధిలోని టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది.

News February 14, 2026

తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

తూర్పు గోదావరి జిల్లాలో 6 కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 7వ తరగతి అర్హత కలిగి, వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. కోర్టు అసిస్టెంట్‌కు నెలకు రూ.10వేలు, కోర్ట్ అటెండెంట్‌కు రూ.6వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://eastgodavari.dcourts.gov.in/

News February 14, 2026

ఆయిల్ పామ్ తోటల్లో ఈ అంతర పంటలతో మేలు

image

ఆయిల్ పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. పూత సమయంలో వీటిని దున్నితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటివి అంతర పంటలుగా సాగు చేయడానికి అనువైనవి.