News August 30, 2024
ప్రధాని మోదీ పాక్ పర్యటనపై సస్పెన్స్

ఇస్లామాబాద్‌లో అక్టోబర్‌లో జరగనున్న SCO సమ్మిట్‌కు ప్రధాని మోదీ హాజరుపై సందిగ్ధత నెలకొంది. సదస్సు విషయమై పాక్ ఇప్పటికే అధికారికంగా ఆహ్వానం పంపింది. సీమాంతర ఉగ్రవాదం, కశ్మీర్ అంశాల్లో పాక్ ఆగడాలను అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పర్యటనపై స్పష్టత రావాల్సి ఉంది. కజకిస్థాన్ SCO సమ్మిట్‌కి కూడా మోదీ గైర్హాజరయ్యారు.
Similar News
News November 16, 2025
పంచాయతీ నిధుల వివరాలు తెలుసుకోండిలా!

గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఖర్చులను తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. కానీ ఎవరిని అడగాలో తెలియదు. అయితే ‘e-Gram Swaraj’ <
News November 16, 2025
కార్మికులపై CBN వ్యాఖ్యలు దారుణం: రామకృష్ణ

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై CM చంద్రబాబు <<18299181>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నామని CPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. కార్మికులు పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారనడం దారుణమన్నారు. ఆయన మాటలు తెలుగు జాతిని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్సెలార్ మిట్టల్‌కు క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు కానీ విశాఖ స్టీలుకు ఎందుకు అడగరని ప్రశ్నించారు.
News November 16, 2025
అది ఛేజ్ చేయగలిగే టార్గెటే: గంభీర్

టెస్టుల్లో ఆడాలంటే స్కిల్‌తో పాటు మెంటల్ టఫ్నెస్ ఉండాలని IND హెడ్ కోచ్ గంభీర్ అన్నారు. SAతో తొలి టెస్టులో <<18303459>>ఓటమి<<>> అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘124 ఛేజబుల్ టార్గెటే. పిచ్ ఆడేందుకు వీలుగానే ఉంది. ఇలాంటి పిచ్‌పై ఆడాలంటే టెక్నిక్, టెంపెరమెంట్ ఉండాలి. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. మేం అడిగిన పిచ్‌నే క్యూరేటర్ తయారు చేశారు. బాగా ఆడనప్పుడు ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.


