News August 9, 2024

NDA అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ.. ఓట్ల అధ్యయనానికి కమిటీ

image

AP: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికలో కూటమి అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో CM చంద్రబాబు కమిటీ వేశారు. ఇందులో TDP నుంచి పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, JSP నుంచి పంచకర్ల రమేశ్, BJP నుంచి విష్ణుకుమార్‌కు అవకాశం దక్కింది. అర్బన్, రూరల్‌లో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది వీరు CMకు నివేదిక ఇస్తారు.

Similar News

News July 6, 2025

ఆ సమయంలో 9 రోజులు అన్నం ముట్టను: హీరోయిన్

image

తాను ఏడాదికి రెండు సార్లు ఉపవాసం ఉంటానని హీరోయిన్ నర్గీస్ ఫక్రీ తెలిపారు. ఆ సమయంలో 9 రోజులపాటు ఏమీ తిననని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఉపవాసం చేసినన్ని రోజులు నీళ్లు తాగే బతుకుతా. ఫాస్టింగ్ అయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కానీ ముఖంలో కాస్త గ్లో ఉంటుంది. ఉపవాసం అయిపోయాక హై ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటా’ అని చెప్పుకొచ్చారు. కాగా నర్గీస్ ఇటీవల విడుదలైన ‘హౌస్‌ఫుల్ 5‘ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

News July 5, 2025

54 ఏళ్ల తర్వాత..

image

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగిస్తున్నారు. 54 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. 1971లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా గిల్ తొమ్మిదో ప్లేయర్ కావడం గమనార్హం. అటు ఒకే టెస్టులో రెండు శతకాలు చేసిన 3వ భారత కెప్టెన్ అతడు. ఇక WTCలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్(9) తర్వాతి స్థానంలో గిల్(8) ఉన్నారు.

News July 5, 2025

దారుణం: కత్తితో పొడిచి.. తాళి కట్టి.. సెల్ఫీ దిగి

image

కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతికి తాళి కట్టాడు. మైసూర్‌కు చెందిన పూర్ణిమ (36) టీచర్. అభిషేక్ ప్రేమ పేరుతో ఆమె వెంటపడేవాడు. ఇవాళ ఆమెను కత్తితో పొడిచాడు. యువతి స్పృహ తప్పి కిందపడిపోగానే మెడలో తాళి కట్టాడు. ఆపై సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. తర్వాత అతడే ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో పారిపోయాడు. పూర్ణిమ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.