News June 18, 2024

APలో పట్టాదారు పాసుపుస్తకాల నిలిపివేత

image

రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ కోసం గత సర్కారు ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను నిలిపివేయాలని NDA ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 20 లక్షలమంది రైతులకు పుస్తకాలు అందాల్సి ఉండగా ఎన్నికల వల్ల వేలాదిమందికి అవి రాలేదు. మాజీ సీఎం జగన్ ఫొటో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రీ-సర్వే కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది.

Similar News

News January 17, 2026

సిరిసిల్ల జనరల్ మహిళ.. వేములవాడ బీసీ జనరల్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు మున్సిపాలిటీల పీఠానికి రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. సిరిసిల్ల మున్సిపాలిటీ- జనరల్ మహిళ, వేములవాడ మున్సిపాలిటీ- బీసీ జనరల్ కేటాయించారు. గతంలో ఈ రెండు మున్సిపాలిటీలలో బీసీ మహిళలు ఛైర్‌పర్సన్లుగా కొనసాగగా, తాజా రిజర్వేషన్లతో సమీకరణాలు మారాయి. రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా కేటగిరీల అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

News January 17, 2026

పురుషులకూ ఫ్రీ బస్సు: AIADMK

image

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు AIADMK తొలి విడత మ్యానిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.2వేలు, సిటీ బస్సుల్లో పురుషులకూ ఫ్రీ జర్నీ, ఇల్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ.25వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించింది.

News January 17, 2026

కోళ్ల పందేలు.. రూ.2వేల కోట్ల వ్యాపారం!

image

AP: ఈ సంక్రాంతి సీజన్‌లో కోళ్ల పందేళ్ల రూపంలో సుమారు రూ.2వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పందేల విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి జోరుగా పందేలు సాగాయి. పెద్దఎత్తున తెలంగాణవాసులు కూడా పందేళ్లలో పాల్గొని సందడి చేశారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు.