News December 13, 2024

నేడు స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ లాంచ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను నేడు CM చంద్రబాబు ఆవిష్కరిస్తారు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి CMతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారు. కాగా 2047 నాటికి నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలిపి, దేశానికి ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని సర్కార్ సంకల్పించింది.

Similar News

News January 20, 2025

బన్నీ రికార్డును బ్రేక్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’!

image

విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. సంక్రాంతి బరిలో 6 రోజుల్లోనే రూ.180+ కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఈ రికార్డు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’పై(వారంలో రూ.180 కోట్లు) ఉండేది. వెంకీ చిత్రం కోసం ఫ్యామిలీలు క్యూ కడుతుండటంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.

News January 20, 2025

త్వరలో వాట్సాప్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్లు

image

AP: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను త్వరలో వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సీఆర్ఎస్ అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. వాట్సాప్‌లో సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని మొదటగా తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.

News January 20, 2025

JEE మెయిన్స్ రాస్తున్నారా? ఇవి తెలుసుకోండి!

image

జనవరి 22 నుంచి 30 వరకు JEE మెయిన్స్ జరగనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు అధికారుల సూచనలు:
– అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫాం తప్పనిసరి
– ఐడెంటిటీ కార్డు, అన్లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఫొటో. బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లాలి
– పెన్సిల్స్, నగలు, ఫోన్, వాటర్ బాటిల్, పర్సులకు నో ఎంట్రీ
– పరీక్ష సమయానికి 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలి.
– ఉ.9-12 గం., మ.3-6 గం. మధ్య 2 షిప్టుల్లో జరగనుంది