News October 11, 2024
స్విగ్గీ బాయ్‌కాట్ నిర్ణయం వెనక్కి
AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్‌కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
Similar News
News November 9, 2024
YCP MLA తాటిపర్తిపై కేసు నమోదు
AP: మంత్రి నారా లోకేశ్‌పై అసత్య ఆరోపణలు చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక టీడీపీ కార్యకర్త చేదూరి కిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 18న లోకేశ్‌పై వారం వారం పేకాట క్లబ్ ద్వారా లోకేశ్‌కు కమీషన్లు అందుతున్నాయని ఎక్స్‌లో చంద్రశేఖర్ పోస్టు చేశారు. దీనిపై పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులిచ్చారు.
News November 9, 2024
అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్?
AP: అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2 ఏళ్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. కొండపల్లి, మూలపాడుతో పాటు రాజధాని ప్రాంతాల్లో కూడా స్థలాన్వేషణ చేస్తోంది. దీని బాధ్యతను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నికి అప్పగించింది. కాగా ఇటీవల సీఎం చంద్రబాబుతో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై చర్చించిన సంగతి తెలిసిందే.
News November 9, 2024
ప్రాఫిటబుల్ కంపెనీలూ లేఆఫ్స్ వేస్తే ఉద్యోగులు నమ్మేదెలా: ZOHO ఓనర్
లేఆఫ్స్ వేసే ప్రాఫిటబుల్ కంపెనీలను ఉద్యోగులెలా నమ్ముతారని ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు ప్రశ్నించారు. ‘ఆ కంపెనీ వద్ద $1BNS క్యాష్ ఉంది. వార్షిక ఆదాయం కన్నా ఇది 1.5 రెట్లు ఎక్కువ. 20% గ్రోత్‌రేటుతో లాభాల్ని ఆర్జిస్తోంది. అయినా $400 మిలియన్లతో షేర్లు బయ్‌బ్యాక్ చేసి, 12-13% ఉద్యోగుల్ని తొలగించి వారి విశ్వాసాన్ని ఆశించడం దురాశే’ అని అన్నారు. రీసెంటుగా 660 మందిపై వేటువేసిన ప్రెష్‌వర్క్స్‌ను విమర్శించారు.