News September 20, 2024

80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్ పోటీల్లో!

image

నైపుణ్యం సాధించేందుకు వయసుతో పని లేదనే విషయాన్ని గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల స్విమ్మర్ బకుల పటేల్ నిరూపించారు. 13 ఏళ్లకే పెళ్లవడం, పిల్లలు యుక్తవయసులో ఉండగానే భర్తను కోల్పోవడంతో ఆమె ఒంటరైపోయారు. భయాన్ని పోగొట్టేందుకు పటేల్ ఈతను ఎంచుకున్నారు. 58 ఏళ్ల వయసులో నదిలో మునిగి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా పట్టుదలతో ఈతలో ప్రావీణ్యం పొందారు. ఇప్పటికే 9 అంతర్జాతీయ విజయాలు సహా 530+ పతకాలు సొంతం చేసుకున్నారు.

Similar News

News September 20, 2024

లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు: ఏఆర్ డెయిరీ

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ స్పందించింది. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వెల్లడించింది. ఇదే విషయాన్ని టీటీడీకి వివరించినట్లు చెప్పింది. జులైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని వెల్లడించింది.

News September 20, 2024

ఉప్పరపల్లి కోర్టుకు జానీ

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి జానీని పోలీసులు విచారించారు.

News September 20, 2024

CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

image

చార్టెర్డ్ అకౌంటెన్సీ (CA)-2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 12, 14, 16, 18 తేదీల్లో ఫౌండేషన్ కోర్స్ ఎగ్జామ్స్ ఉంటాయని ICAI ప్రకటించింది. జనవరి 11, 13, 15 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-1, జనవరి 17, 19, 21 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్ కోర్సుల పరీక్షలు మ.2 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వివరించింది.