News January 10, 2025
అటూ ఇటూ ఊగిసలాట.. చివరికి నష్టాలు
స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఊగిసలాటలతో సాగాయి. బెంచ్ మార్క్ సూచీల్లో కీలక సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయుల్లో బుల్స్-బేర్స్ తమ పట్టు నిలుపుకున్నారు. Sensex 241 పాయింట్లు కోల్పోయి 77,378 వద్ద, Nifty 95 పాయింట్ల నష్టంతో 23,431 వద్ద స్థిరపడ్డాయి. IT స్టాక్స్ 3.44% లాభపడి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇతర అన్ని రంగాలు నష్టాలబాటపట్టాయి. Q3 ఫలితాలు మెప్పించడంతో TCS 5.60% లాభపడింది.
Similar News
News January 25, 2025
జగన్, VSR కలిసి డ్రామా ఆడుతున్నారు: బుద్దా వెంకన్న
AP: రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం జగన్‌కు తెలిసే జరిగిందని TDP నేత బుద్దా వెంకన్న అన్నారు. ‘కేసులను పక్కదారి పట్టించేందుకు ఈ డ్రామా. చంద్రబాబుతో విభేదాలు లేవంటే నమ్మేంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. చంద్రబాబు కుటుంబాన్ని నువ్వు అన్న మాటలు మర్చిపోను. నిన్ను క్షమించను. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీల లెక్క తేలాలి. విజయసాయిరెడ్డి దేశం విడిచి వెళ్లడానికి CBI అనుమతి ఇవ్వకూడదు’ అని ట్వీట్ చేశారు.
News January 25, 2025
నేడు VSR రాజీనామా
AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు ఉపరాష్ట్రపతితో భేటీ కానున్నారు. ఢిల్లీలో ఈ రోజు ఉ.10.30 గంటలకు ఆయనను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. కాగా, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని VSR తెలిపారు. తాను ఏ రాజకీయా పార్టీలోనూ చేరబోనని, వ్యవసాయం చేసుకుంటానని ట్వీట్ చేశారు.
News January 25, 2025
ముంబై దాడులు: రాణా అప్పగింతకు US సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
2008 ముంబై దాడుల కేసులో కీలక ముందడుగు పడింది. ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అతడి అప్పగింతపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను తాజాగా కొట్టేసింది. దీంతో నేరగాళ్ల ఒప్పందం ప్రకారం త్వరలోనే అమెరికా రాణాను భారత్‌కు సరెండర్ చేయనుంది. పాకిస్థాన్ ISI, లష్కరే తోయిబాతో సంబంధాలున్న అతడే ముంబై పేలుళ్ల సూత్రధారి అని గతంలో IND ఆధారాలు సమర్పించింది.