News November 16, 2024
T20 సిరీస్ ఆసీస్ కైవసం
పాకిస్థాన్‌తో జరుగుతున్న 3 టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. రెండో టీ20లో ఆసీస్ 13 రన్స్ తేడాతో నెగ్గింది. ఆస్ట్రేలియా తొలుత 20 ఓవర్లలో 147/9 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ 19.4 ఓవర్లు ఆడి 134 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (52) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. స్పెన్సర్ జాన్సన్ 5 వికెట్లతో చెలరేగారు. నామమాత్రపు చివరి టీ20 ఎల్లుండి హోబర్ట్‌లో జరుగుతుంది.
Similar News
News December 13, 2024
నేడు రాష్ట్ర వ్యాప్తంగా YCP పోరుబాట
AP: మద్దతు ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు అండగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైనట్లు YCP ప్రకటించింది. రైతులతో కలిసి తమ నాయకులు కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాలు అందజేస్తారని తెలిపింది. రైతుల గోడు ప్రభుత్వానికి తెలిసేలా నిరసన చేపట్టనున్నట్లు వివరించింది. ధాన్యం కొనుగోలు, రూ.20వేలు పెట్టుబడి సాయం తదితర సమస్యలపై YCP పోరాడుతుందని మాజీ CM జగన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
News December 13, 2024
బాబోయ్.. ఇదేం చలి!
TG: రాష్ట్రంలోని పలు జిల్లాలను చలి వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 7°C నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 వరకు చలి ప్రభావం ఉంటుండగా వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికి తోడు పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు.
News December 13, 2024
పెదవుల పగుళ్లను నివారించండిలా!
చలికాలంలో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య పెదవుల పగుళ్లు. రాత్రి పడుకునే ముందు పాలతో పెదవులను మర్దన చేసుకొని మార్నింగ్ లేవగానే కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొబ్బరి నూనె, ఆ నూనెతో తయారు చేసిన లిప్ బామ్స్ కూడా పగుళ్లను నివారిస్తాయి. తేనె కూడా పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాత్రి పూట రాసి ఉదయాన్నే కడిగితే పెదవులు మృదువుగా మారిపోతాయి. వీటితో పాటు తగినంత నీటిని తాగడం ముఖ్యం.