News June 27, 2024
T20 WC: మళ్లీ విఫలమైన కోహ్లీ
T20 WCలో కీలకమైన సెమీ ఫైనల్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలమయ్యారు. ఇంగ్లండ్‌తో గయానాలో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 9 పరుగులకే ఔటయ్యారు. ఈ ప్రపంచకప్‌లో ఈరోజు మ్యాచ్‌కు ముందు వరకు విరాట్ 1, 4, 0, 24, 37, 0 రన్స్ చేశారు. దీనికి కేవలం సుమారు 2 వారాల ముందు జరిగిన ఐపీఎల్‌లో ఆయన ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News December 12, 2024
ప్రపంచంలోనే అరుదైన రక్తం ఇదే!
ప్రపంచంలో పలు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పటికీ Rh-null అనేది అరుదైన రక్త సమూహంగా పరిగణిస్తుంటారు. దీనిని ‘గోల్డెన్ బ్లడ్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 కంటే తక్కువ మంది మాత్రమే ఈ ప్రత్యేకమైన రక్త వర్గాన్ని కలిగి ఉన్నారు. ఇది అరుదుగా ఉండటం వల్ల దీనిని విలువైనదిగా భావిస్తారు. యాంటీజెన్స్ ఉండవు కాబట్టి Rh వర్గం వారికి వినియోగించాల్సి వచ్చినపుడు దీని మ్యాచ్‌ను కనుగొనడం చాలా కష్టం.
News December 12, 2024
100 రోజుల యాక్షన్ ప్లాన్: లోకేశ్
ఏపీలో మోడల్ విద్యావ్యవస్థ రూపకల్పనకు అధికారులంతా నడుంబిగించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ‘ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ పెరగాలి. జీరో డ్రాపవుట్స్ మా లక్ష్యం. రానున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై అధికారులు ఫోకస్ పెట్టాలి. చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పోషకవిలువలు కలిగిన ఆహారం అందించాలి. యాంటీ డ్రగ్స్ అవగాహన కల్పించాలి’ అని కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు.
News December 12, 2024
ఇలాంటి వెడ్డింగ్ కార్డును చూసుండరు!
వినూత్నంగా రూపొందించిన ఓ శుభలేఖ వైరలవుతోంది. ఇందులో వధువు, వరుడు పేరుకు బదులు శర్మాజీ కూతురితో గోపాల్ జీ కొడుకు వివాహం అని రాశారు. టింకూ పరీక్షలు జనవరి 5న పూర్తవుతుండటంతో అదేరోజు పెళ్లి జరుగుతుందని ముహూర్తం గురించి రాసుకొచ్చారు. పెళ్లికి వచ్చేవారు గిఫ్టులు తేవొద్దని, కేవలం క్యాష్, గూగుల్ పే ద్వారా డబ్బును పంపాలని సూచించారు. ఫుడ్ గురించి చెప్తూ రూ.2000కు ఓ ప్లేట్ అని, వేస్ట్ చేయొద్దని కోరారు.