News May 29, 2024
T20 WC: అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు కోహ్లీదే
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. అతను ఇప్పటివరకు 14 హాఫ్ సెంచరీలు చేశారు. ఈ లిస్టులో కోహ్లీ తర్వాత వరుసగా క్రిస్ గేల్(9), రోహిత్ శర్మ(9), జయవర్దనే(7), దిల్షాన్(6), డేవిడ్ వార్నర్(6) ఉన్నారు. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో గేల్ రెండు సెంచరీలు చేయగా, మిగతా బ్యాటర్లు ఒక్కో శతకం బాదారు.
Similar News
News January 19, 2025
మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడంటే?
TG: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఇది జరుగుతుందని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవడంలో వెనుకబడ్డామని హైకమాండ్ మందలించినట్లు చెప్పారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు.
News January 19, 2025
సైఫ్‌పై దాడి.. థానేలో నిందితుడి అరెస్ట్!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని థానేలో ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా అతడిని ఓ రెస్టారెంట్ సమీపంలో గుర్తించినట్లు తెలిపింది. సుమారు 100 మంది పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News January 19, 2025
‘కన్నప్ప’ స్టోరీ ఐడియా ఆయనదే: మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా గురించి ఏడెనిమిదేళ్లుగా ప్లానింగ్‌లో ఉన్నట్లు హీరో మంచు విష్ణు చెప్పారు. బడ్జెట్ కారణాల వల్ల ఇప్పుడు కుదిరిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాకు ఐడియా తనికెళ్ల భరణి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటి స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.