News January 19, 2025

మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడంటే?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఇది జరుగుతుందని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవడంలో వెనుకబడ్డామని హైకమాండ్ మందలించినట్లు చెప్పారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 8, 2025

ఢిల్లీలో AAPకు కాంగ్రెస్ దెబ్బ: రాజ్‌దీప్

image

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ AAPకు చాలా డ్యామేజ్ చేసిందని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సాధించిన ఓట్లు బీజేపీ-ఆప్ ఓట్ల మధ్య వ్యత్యాసం కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే చాలా సీట్లలో నెక్ టు నెక్ ఫైట్ ఉండేదన్నారు. 2022లో గోవాలో కాంగ్రెస్ ఇలాగే AAPకు డ్యామేజ్ చేసిందని గుర్తు చేశారు.

News February 8, 2025

ఢిల్లీ ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును అంగీకరిస్తున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీవాసుల హక్కులను రక్షించేందుకు, ఢిల్లీ అభివృద్ధి కోసం, కాలుష్యం, అవినీతి, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని Xలో రాసుకొచ్చారు. ఈ ఎన్నికల్లోనూ ఢిల్లీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.

News February 8, 2025

ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి: మోదీ

image

ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ ప్రజలకు ఈ రోజు పండుగలాంటిదని విజయోత్సవ సభలో చెప్పారు. ‘ఢిల్లీని వికసిత్ రాజధానిగా మార్చే అవకాశం ఇచ్చారు. ఢిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇక్కడి ప్రజలు మోదీ గ్యారంటీని విశ్వసించి డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చుకున్నారు. BJPని మనసారా ఆశీర్వదించారు. మీ ప్రేమకు అనేక రెట్లు తిరిగి ఇస్తాం’ అని పీఎం ప్రసంగించారు.

error: Content is protected !!